Showing posts with label Ramcharan Tej. Show all posts
Showing posts with label Ramcharan Tej. Show all posts

Friday, 27 February 2015

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంపై ఫేస్‌బుక్‌లో పోస్టర్‌

చిరంజీవి 150వ చిత్రంపై ఫేక్‌ పోస్టర్‌



మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతోంది. సోషల్‌ వెబ్‌సైట్‌లో తమ అభిమాన హీరో చిరంజీవి 150వ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అంటూ ఓ ఫోటో హల్‌చల్‌ చేస్తోంది. చిరంజీవి నటిస్తున్న చిత్రం పేరు ‘ఆటోజానీ’ అని ఆ చిత్రానికి పూరిజగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నాడని అభిమానులు ఫేస్‌బుక్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. చిరు చిత్రంపై ఇప్పటికే పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్శకులను ఎంపిక చేసే పనిలో మెగా ఫ్యామిలీ నిమగ్నమైంది. చిరంజీవితో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పూరి తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇదీవరకే ‘ఆటో జానీ’ అనే టైటిల్‌ను పూరి  రిజిస్టర్‌ చేయించారు. ఇప్పటికైనా తన 150వ చిత్రంపై చిరంజీవి క్లారిటీ ఇస్తే మెగా అభిమానుల సందిగ్ధత తొలగిపోతుంది.