Showing posts with label manabalayya. Show all posts
Showing posts with label manabalayya. Show all posts

Saturday, 28 February 2015

బాలయ్య బాబుకు భారీ బహుమతి


 నటసింహం 



బాలకృష్ణను నటసింహం అని పిలుచుకునే నందమూరి అభిమానులు బాలయ్య బాబుకు భారీ బహుమతి ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. రూ.10 లక్షల విలువ చేసే సింహం బొమ్మను తయారు చేసి గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారట. క్రిస్ట్‌ల్‌ గ్రానైట్‌తో గోధుమ రంగులో 10 అడుగుల పొడవు, 4.5 అడుగుల ఎత్తు గల సింహాన్ని నందమూరి అభిమానులు తయారు చేయిస్తున్నారు. 





దీన్ని బాలకృష్ణ వందో సినిమా ప్రారంభోత్సవంలో బహుకరించనున్నారు. ఈ విషయమై ఎన్‌.బి.కె. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వ్యవస్థాపకుడు అనంతపురం జగన్‌ తెలిపారు. ఇప్పటికే జగన్‌ ‘నందమూరి శిఖరం’ అనే పుస్తకాన్ని ఆయనకు సమర్పించారు. ఒక స్టార్‌ వారసుడిగా 100 చిత్రాలు చేస్తున్న ఘనతపై ఆయన వివరించారు. నందమూరి అభిమానులు సందర్భాన్ని బట్టి సేవ 
కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూంటారు. ఇప్పుడా అభిమానాన్ని నేరుగా బాలకృష్ణపై చూపేందుకు బహుమతిగా భారీగా ఖర్చు చేసి మరీ సింహాన్ని తయారు చేయిస్తున్నారు. ఇది తయారు చేయడానికి సుమారు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఈలోపు బాలకృష్ణ వందో సినిమా కూడా సిద్దమవుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. ప్రస్తుతం బాలయ్య బాబు 98వ చిత్రం ‘లయన్‌’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ చివర్లో ఉంది. ఈ చిత్రం తర్వాత వెంటనే శ్రీవాస్‌ దర్శకత్వంలో తన 99వ చిత్రం ప్రారంభిస్తారు. ఇవి పూర్తవడానికి ఎలాగూ ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది కాబట్టి ఆ సమయానికల్లా ఈ లయన్‌ రెడీ అవుతుందని ఎన్‌.బి.కె. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ వ్యవస్థాపకుడు అనంతపురం జగన్‌ తెలిపారు.





 Nandamuri Balakrishna  Lion First Look official Teaser Exclusive For Fans